జ్యోతిష్య శాస్త్రం అంటే జీవితానికి సంబంధించి శాస్త్రం అంటే దాని గురించి అధ్యయనం చేయబడింది అని మనిషి యొక్క జీవితంలో మంచి యొక్క స్థితిగతులను, చెడు జరగబోతున్న సందర్భాలను తెలుసుకొని భవిష్యత్తులో ముందడుగు వేయడానికి మనం ఎటువంటి పరిహారాలు ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందుతామో అన్న అంశాన్ని తెలియజేస్తూ మన జీవితంలో మంచి జీవితాన్ని పొందడానికి అవకాశాలు కల్పించేదే జ్యోతిష్య శాస్త్రం.
జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి ఎవరి జాతకాన్నైనా నిర్దారించి రాయబోయే సందర్భంలో జ్యోతిష్య శాస్త్రంలో ఒక పద్య రూపంలో తెలియజేయబడింది జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వ పుణ్యానాం లిఖిత్వే జన్మ పత్రిక. అంటే మనం ఏ వంశంలో అయితే పుట్టామో ఈ భూమ్మీద, ఏ వంశంలో ఎటువంటి స్థితిగతులను అనుభవించ పోతున్నామో అదేవిధంగా పదవి పూర్వ పుణ్యానాం... గత జన్మలో చేసిన పాప కర్మల ఫలితాలను బట్టి ఈ జన్మలో ఏ విధమైన ఉన్నతమైన జీవితాన్ని పొందుతున్నామో అన్న అంశాన్ని తెలియజేస్తూ లిఖిత్వే జన్మ పత్రిక అంటే సవివరంగా రాస్తున్నదే ఈ జన్మపత్రిక అని రాసి ఆ తర్వాత జాతకానికి సంబంధించిన వివరాలను తెలియ జేయడం జరుగుతుంది.
ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనిషి యొక్క స్థితిగతులను తెలుసుకొని జరగబోతున్న చెడుకు సంబంధించిన పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందవచ్చు. కాబట్టి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో జ్యోతిషశాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలకై ఈ జన్మ జన్మ తేదీ, జన్మ సంవత్సరము, పుట్టిన స్థలము, పుట్టిన సమయాన్ని ప్రధానంగా తీసుకొని ఈ యొక్క వివరాలను ఆచరించాలి.
ఈ యొక్క విధానాన్ని ఆచరించిన వారికి సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రం అంత గొప్పది కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
మీ యొక్క జాతకానికి సంబందించిన వివరాలకు సంప్రదించండి - 6281462695